Tuesday, July 23, 2024

TS : ఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌

పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీ ఫార్మసీ సెంకడియర్ ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS ECET)-2024 ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి.

- Advertisement -

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. అయితే, మే 6న మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్‌ పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థినీ విద్యార్థులు https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement