Tuesday, May 7, 2024

Breaking: భార‌త్ జోడో యాత్ర‌కు సోనియాగాంధీ.. ఈనెల 6వ తేదీన క‌ర్నాట‌క‌లో పాద‌యాత్ర‌!

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో పాద‌యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో యాత్ర కొన‌సాగిస్తున్నారు. కాగా, త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా రాహుల్ యాత్ర‌లో పాల్గొన‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఇక .. సోనియాగాంధీ అక్టోబర్ 6వ తేదీన కర్నాటకలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొంటారని ఆ పార్టీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. క‌ర్నాట‌క‌లో 511 కిలోమీటర్ల మేర యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై తమిళనాడు, కేరళ మీదుగా శుక్రవారం క‌ర్నాట‌క‌లోకి ప్రవేశించింది.

సోనియా గాంధీ అక్టోబర్ 6న క‌ర్నాట‌క‌లో జ‌రిగే పాద‌యాత్రలో పాల్గొనేవారితో కలిసి నడుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ వైద్య పరీక్షల నిమిత్తం విదేశాల్లో ఉన్నప్పుడు ప్రారంభించిన యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాహుల్ గాంధీ యాత్రలో నిరంతరాయంగా పాదయాత్ర చేస్తూ సెప్టెంబర్ 30న పొరుగున ఉన్న తమిళనాడులోని గూడలూరు నుంచి కర్నాటకలోని గుండ్లుపేట చేరుకున్నారు. కర్నాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యాత్ర కీలక దశలోకి ప్రవేశించింది.

ఇక ప్రేమతోనే ద్వేషాన్ని అధిగమించొచ్చు అని రాహుల్​ గాంధీ ఓ ట్వీట్​లో పేర్కొన్నారు. ‘‘ఈ విద్వేషపు రాజకీయాలే మా నాన్న రాజీవ్​ గాంధీని బలితీసుకున్నాయి. అట్లాంటి పని ఈ దేశానికి పట్టనివ్వను” ప్రేమతో అన్నిటిపై విజయం సాధించవచ్చు. అని తన ట్వీట్​లో పేర్కొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement