Friday, May 17, 2024

TS: హస్తం గూటికి గులాబీ నేతలు.. కాంగ్రెస్ తోనే ప్రజాసంక్షేమం..

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 30 (ప్రభ న్యూస్) : కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమమని, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమానికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ఇందూరులో బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ గూటికి గులాబీ నేతలు చేరారు. మంగళవారం నగరంలోని ఇద్దరు కార్పోరేటర్లు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు సమక్షంలో, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీఅభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ సమక్షంలో గులాబీ నేతల చేరిక..
నిజామాబాద్ నగరంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల ముఖ్య అనుచరులు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హాందాన్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మచ్కూర్ నవీన్, కంటేశ్వర్ టెంపుల్ మాజీ చైర్మన్ కోవూరు జగన్, గంగ పుత్ర సంఘం నాయకులు అన్నయ్యలు కాంగ్రెస్ నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

- Advertisement -


మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ లో కార్పొరేటర్ల చేరిక…
నిజామాబాదు నగరంలోని బీఆర్ఎస్ పార్టీ 46వ వార్డు కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్, 10వ వార్డు కార్పొరేటర్ కోమల్ లు బీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాదు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లకు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement