Sunday, April 11, 2021

పోలీసులకు పదోన్నతులతోనే గుర్తింపు, ఉత్సాహం …… కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప

కర్నూలు – కర్నూలు జిల్లా పోలీసుశాఖలో అయిదుగురు ఎ ఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతులు రావడం అభినందనీయమని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. ఈ సంధర్బంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదోన్నతులు పొందిన ఎఎస్సైలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. చాలా ఏళ్ళ తర్వాత పదోన్నతులు రావడం సంతోషదాయకమన్నారు. దాదాపు అందరికి 30 ఏళ్ళ సర్వీసు పూర్తయిందన్నారు. మిగిలిన సర్వీసును కూడా ఏలాంటి రిమార్కు లేకుండా పూర్తి చేయాలన్నారు. మరిన్ని పదోన్నతులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పదోన్నతులు పొందిన సబ్ ఇన్ స్పెక్టర్ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News