Saturday, April 20, 2024

ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన వకీల్ సాబ్ నిర్మాతలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నివేద థామస్ అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన 4వ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.

ఆయన మాటలను నమ్మిన అభిమానులు ఆ పాట కోసం ఆతృతగా ఎదురు చూశారు. కానీ 4వ పాట రిలీజ్ కాలేదు. దీనితో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ ట్రోల్స్ చేశారు. కాగా చిత్ర యూనిట్ ఈ నేపథ్యంలోనే ఆ విషయంపై స్పందించింది. కదులు కదులు పాటను సరైన సమయానికి తీసుకురాలేకపోతున్నాం. సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతుంది. ఇలా మిమ్మల్ని ఎదురుచూసేలా చేసినందుకు క్షమించండి అంటూ దిల్ రాజు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది.

కాగా గతేడాది రిలీజ్ అయిన మగువా మగువా సాంగ్ అలాగే సత్యమేవ జయతే, కంటి పాప కంటి పాప సాంగ్ ల కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement