Thursday, April 25, 2024

వేలం పాట…

పాపన్నపేట : ప్రసిద్ద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రంలో వివిధ రకాల వస్తువుల విక్రయాలు నిర్వహించుకునేందుకు బహిరంగ వేళం పాట నిర్వహించగా దేవాదాయ ధర్మాదదాయశాఖకు ఒకలక్షా 10వేల రూపాయలు సమకూరినట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన కార్యాలయంలో కొబ్బరికాయలు, బోండాలు, ఓడిబియ్యం, కొబ్బరి ముక్కలు ప్రొగుచేసుకునే హక్కు, జాతరలో భక్తులు సమర్పించిన తల వెంట్రుకల వేలం పాటలు నిర్వహించారు.కాగా కొబ్బరికాయ, బోండాలు అమ్ముకునే హక్కు, ఒడిబియ్యం పొగుచేసుకునే హక్కులకు ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ద్వారా స్టే వచ్చింది. దాంతో రెండు హక్కులను మినహాయించగా జాతరలో ప్రొగుచేసిన తల వెంటుక్రలను వేలం నిర్వహించగా ఒక లక్ష 10వేల రూపాయలు వచ్చాయి. కొబ్బరి ముక్కలు పోగుచేసుకునే హక్కు కోసం వేలం పాటలో పొల్గొనేందుకు ఒకే ఒక్కరు రావడంతో వేలంపాటను వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్‌, మధుసూధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మహేష్‌, నరేష్‌, యాదగిరి, నర్సింలు లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వేలం పాట దారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement