Tuesday, May 7, 2024

అధిక వసూళ్ల పై చర్యలు తీసుకోవాలి.

కర్నూల్, గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక కర్నూల్ నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు ఈ రోజు కర్నూల్ కలెక్టర్ కార్యాలయం లోని సహాయ సరఫరా అధికారి రాజా రఘువీర్ కి ఆ సంఘం వినతి పత్రం అందజేసింది ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీలు జనాలు పాటించకుండా గ్యాస్ సిలిండర్ పై అదనపు వసూలుకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు, రవాణా చార్జీల పేరుతో ప్రజల నుంచి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారని, 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తూ నిబంధనలు అమలు చేయడం లేదన్నారు, ఉచిత డెలివరీ ఏ రోజు చేయలేదని, కర్నూల్ టౌన్ 10 కిలోమీటర్ల లోపే ఉన్న వసూళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారన్నారు, గ్యాస్ డెలివరీ సమయంలో బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు, నిబంధనలు పాటించని గ్యాస్ ఏజెన్సీలు పై అధికారులు చర్యలు తీసుకొని అధిక వసూళ్లు ఆపాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు, జయమ్మ, లక్ష్మి, పద్మావతి, ఆటో పీటర్, పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement