Friday, April 26, 2024

మహనీయుల జయంతులను వారి విగ్రహాలముందే జరపండి

కర్నూలు – ఈ నెలలో నిర్వహించే మహనీయులైన మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ల జయంతి కార్యక్రమాలను వారి విగ్రహాల ముందే నిర్వహించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఆనంద్ బాబు కోరారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యం రామాదేవి అధ్యక్షతన జయంతి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి సామాజిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యం చింతామని,సూపరిండెంట్ మద్దిలేటి తో పాటు దళిత సంఘాల నాయకులు బజారన్న, కిరణ్, కర్ణాకర్, గోపి, అనంతరత్నం, సలోమి, చంద్రప్ప, డిపి సామన్న, జ్యోతి, సత్యం, నాగేశ్వరి, దేవదాసు, సోమసుందరం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం నిర్వహించే వారిని, ఈ సంవత్సరం స్థలాన్ని మార్చడం తో పాటూ జిల్లా కలెక్టర్ గాని, జాయింట్ కలెక్టర్లు గాని సమావేశం లో పాల్గొనక పోవడం భాదాకరమన్నారు. జయంతి ఉత్సవాలను సైతం విగ్రహాల ముందు కాకుండా సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తామనడం దళితుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే 5, 11, 14 తేదీలలో నిర్వహించబోయే మహనీయుల జయంతులను వారి వారి విగ్రహాలు ముందే నిర్వహించాలని ఐక్యంగా కోరారు. మహనీయుల స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా స్కూలు, కళాశాలల్లో వక్తృత్వ మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించాలన్నారు. మహనీయుల జయంతి లను నిర్వహించడం అంటే, వారు ఏ సామాజిక తరగతుల నుండి అయితే వచ్చి ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు, వాటన్నిటినీ అధిగమించి ఏ స్థాయికి ఎదిగారు, ఏ సమస్యలు పోవాలని కోరుకున్నారో వాటికి న్యాయం జరిగేలా చూడడమే మన బాధ్యత అని అన్నారు. బాధ్యత సంపూర్ణంగా నెరవేరాలంటే గతంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ఒకరోజు పాటు నిర్వహించిన ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ ను తిరిగి పున: ప్రారంభించి, దళితుల సమస్యల పరిష్కారానికి నోచుకునే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో దళిత సంఘాల తోపాటు సాంఘిక సంక్షేమ శాఖ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement