Tuesday, May 18, 2021

అవుకులో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప…

అవుకు మండలం లోని సుంకేసుల గ్రామ పంచాయతీ సెక్రెటరీ ( రెగ్యులర్)రాజశేఖర్ లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు.. వివ‌రాలలోకి వెళితే అదే గ్రామానికి చెందిన మూల వెంకటేశ్వర రెడ్డి దగ్గర నుండి ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కోసం రాజ‌శేఖ‌ర్ ఆశ్ర‌యించాడు.. దీంతో పంచాయితీ కార్య‌ద‌ర్శి రూ. 20వేలు డిమాండ్ చేశారు.. ముందుగా రూ.10వేల‌కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంత‌రం బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ, శివనారాయణ స్వామి తమ సిబ్బందితో కలిసి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ,అక్కడే మాటువేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.పట్టుబడిన రాజశేఖర్ ఇటీవల జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించాడు.ఉద్యోగంలో ఈ నెల 17 న చేరాల్సి ఉండగా ఇంతలోనే ఏసీబీ కి పట్టుబడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News