Tuesday, April 13, 2021

బిజెపి ఆవిర్భావ వేడుక..

రామాయంపేట : మండల వ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతాపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు కల్వకుంట్ల, నార్లాపూర్‌, బచ్చురాజ్‌పల్లి గ్రామాలలో మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బిజేపి నాయకులు మాట్లాడుతూ 1980 సంవత్సరంలో భారతీయ జనసంఘ్‌ నుంచి భారతీయ జనతాపార్టీగా ఆవిర్భవించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు భారతీయ జనతాపార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని గర్వంగా నిర్వయించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, మండల ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, నవీన్‌గౌడ్‌, మహంకాళి, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్‌, ఆయా గ్రామాల బిజేపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News