Saturday, May 18, 2024

గ్యాస్ పైప్ లైన్ ప‌నులు నిలిపివేయాల‌ని కోరుతూ రైతుల దీక్ష‌..

క‌ర్నూలు – హెచ్ పి సి ఎల్ గ్యాస్ పైప్ లైన్ ప‌నుల‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఉల్చాల గ్రామంలో రైతుల సామూహిక దీక్షలు చేప‌ట్లారు.. రైతుల సామూహిక దీక్షలు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, గ్యాస్ పైప్ లైన్ కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ నుండి తెలంగాణ చర్లపల్లి వరకు నిర్మించబోతున్నారు అని, మన రాష్ట్రంలో గుత్తి కర్నూలు మీదుగా మహబూబ్ నగర్ కు వెళ్తుందని అన్నారు. అయితే ఈ గ్యాస్ పైప్ లైన్ రైతుల పొలాల నుండి తీసుకెళ్తామని రైతులకు నోటీసులు ఇచ్చారు. అయితే త‌మ‌ పొలాల్లో గ్యాస్ పైప్ లైన్ తీసుకెళ్లడానికి తాము అంగీకరించమని రైతులు రిప్లై కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఒక ఎకరం విలువ కోటి రూపాయల పైగా ఉంటుంద‌ని అయితే రైతుల‌కు రూ. 1800 ,2000 మాత్రమే నష్ట పరిహారం ఇచ్చి గ్యాస్ పైప్ లైన్ వేయడం అన్యాయం అన్నారు… అందుకే ఈ ప‌నులు వెంట‌నే ఆపాల‌ని కోరుతూ రైతులు దీక్ష‌లు చేప‌ట్టార‌ని చెప్పారు.. ఈ దీక్ష కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేంద్ర అబ్దుల్లా కర్నూల్ మండల కార్యదర్శి ప్రకాష్ కిషన్ రైతులు మాధవరెడ్డి వెంకటయ్య లక్ష్మన్న రమేష్ ఈశ్వరరెడ్డి రాముడు మాధవరెడ్డి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement