Monday, July 22, 2024

Andhra Pradesh – అల్ల‌ర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్‌ విచార‌ణ షురూ

ఈసీ ఆదేశాల‌తో ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం
14 మందితో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ ఏర్పాటు
తాడిప‌త్రి, తిరుప‌తి, ప‌ల్నాడు, మాచ‌ర్ల,
జ‌మ్మ‌ల‌మ‌డుగు, న‌ర‌స‌రావుపేట‌, చంద్ర‌గిరిలో
సిట్ బృందాలు
ఘర్ష‌ణ‌ల‌పై వివరాల సేక‌ర‌ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఎంక్వైరీ మొదలు పెట్టేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 14 మంది సభ్యుల గల బృందం ఏర్పాటు అయ్యింది. ఇప్ప‌టికే డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను సిట్ చీఫ్ వినీత్ కలిశారు. ఏయే అంశాలపై దర్యాప్తు చేయాలన్న దానిపై డీటేల్స్ తీసుకున్నారు.

- Advertisement -

ఐజీ వినీత్ నేతృత్వం..

కాగా, ఐపీఎస్ అధికారి ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఈ సిట్ పని చేయనున్నది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ పి. శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ వి. శ్రీనివాసరావు, ఏసీబీ డీఎస్పీ రవి మనోహర, ఇన్ స్పెక్టర్లు భూషణం, కె. వెంకట్ రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్. ప్రభాకర్ రావు, శివప్రసాద్ ఉన్నారు సీఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తరువాత జరిగిన హింసాత్మక సంఘటనలపై సిట్ విచారణ జరపనున్నది. రెండురోజుల్లో ఈసీకి సిట్ నివేదిక ఇవ్వనున్నది.

సిట్‌లో 14 మంది స‌భ్యులు

శనివారం ఉదయం నుంచి సిట్ చీఫ్ వినీత్ నేతృత్వంలో 14 మంది సభ్యులు నాలుగు టీమ్‌గా ఏర్పడ్డా యి. ఆయా టీమ్‌లు అనంపురంలోని తాడిపత్రి, తిరుపతిలోని చంద్రగిరి, పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాల్లోని పర్యటిస్తున్నాయి. అల్లర్ల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్‌లు, డీటేల్స్‌ను తొలుత పరిశీలించాయి. గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసు, 60 మంది నిందితులను గుర్తించారు. వీలైతే కొన్ని సెక్షన్లు కూడా జోడించే అవకాశం ఉందని అంటున్నారు కొంతమంది అధికారులు. బాధితులైన కొందరు పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి సమాచారం తీసుకోనున్నారు. లభించిన ఆధారాలతో ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి ఆదివారం ఇవ్వనుంది సిట్.

అల్ల‌ర్ల‌తో సంబంధం ఉన్న లీడ‌ర్ల అరెస్టు..

ఇదిలావుండగా అల్లర్లతో సంబంధ ఉన్న కొందరు రాజకీయ నేతలను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నాయి పోలీస్ వర్గాలు. సిట్ ఇచ్చే ప్రాథమిక నివేదిక పరిశీలించాక ముందుకు ఎలా వెళ్లాలనేది ఎన్నికల సంఘం కీలక సూచనలు ఇవ్వనుంది. ఇంకా లోతుగా విచారణ చేస్తారా? ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement