Saturday, April 27, 2024

మాజీ ఎమ్మెల్యే డివై దాస్ జనసేన పార్టీలో చేరిక…?

పామర్రు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డివై దాస్ మరల జనసేన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం? పామర్రు నియోజకవర్గం నూతనంగా ఏర్పడిన అప్పటి ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డ హయాంలో కాంగ్రెసు త‌రుపున‌పోటీ చేసి ఘన విజయం సాధించి పామర్రు నియోజకవర్గ మొట్ట మొదటి ఎమ్మెల్యే గా డివై దాస్ ఒక అభివృద్ధి ముద్ర వేసుకున్న ఘనత ఆయనకు దక్కింది

ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు అప్పట్లో నాకు ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని దాస్ చెప్పేవారు నేడు వెలువడిన ఎమ్మెల్సీ జాబితాలు ఆయన పేరు లేకపోవడంతో ఆయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం రెండు మూడు రోజుల్లో డివై దాస్ పార్టీ చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది

Advertisement

తాజా వార్తలు

Advertisement