Monday, May 6, 2024

జిలెటిన్ స్టిక్స్ పేలుడు – వై. ఎస్ . ప్రతాపరెడ్డి అరెస్టు

ముగ్గురికి 14 రోజుల రిమాండ్ విధించిన బద్వేలు కోర్టు
కడప బ్యూరో , – జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్ళపల్లి ముగ్గురాళ్ళ గని లో జరిగిన జిలెటిన్ స్టిక్స్ భారీ పేలుడు 10మంది మృతి చెందిన విషయం విధితమే.. ఈ ఘటనలో ఇప్పటికే నాగేశ్వర రెడ్డి, రఘునాథ్ రెడ్డి అను ఇద్దరిని అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు నాలుగో ముద్దాయిగా ఉన్నటువంటి కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పెద్ద నాన్న అయినా వైఎస్ ప్రతాపరెడ్డి(76) ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు, పేలుడు పదార్థాలు కొనుటకు నిల్వ చేసుకునేందుకు వాటిని రవాణా చేసుకునేందుకు లైసెన్సు ఉన్నప్పటికీ పులివెందులకు చెందిన రఘునాథ్ రెడ్డి అనే అతనికి అగ్రిమెంటు రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వైయస్ ప్రతాప్ రెడ్డి మ్యాగజైన్లో నుండి పేలుడు పదార్థాల నిబంధనలను అతిక్రమించి లక్ష్మి రెడ్డి అనే అతనికి విక్రయించగా వాటిని అజాగ్రత్తగా తీసుకెళుతూ జిలెటిన్ స్టిక్స్ దించే క్రమంలో పేలుడు సంభవించిన ఘటనలో లక్ష్మి రెడ్డి తో పాటు మరో 9 మంది మృతి చెందడం జరిగింది, పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీసు వద్ద వైయస్ ప్రతాపరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ముద్దాయిలు నాగేశ్వర్ రెడ్డి రఘునాథ్ రెడ్డి లతోపాటు వైయస్ ప్రతాపరెడ్డిని బద్వేలు కోర్టులో మంగళవారం హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement