Sunday, May 19, 2024

కార్పొరేష‌న్ మాటున భారీగా పేకాట‌, మ‌ట్కా, జూదం

ఓబులవారిపల్లి : గ్యాంగ్‌ లీడర్‌, ముఠా మేస్త్రీ అనగా చిరంజీవి సినిమాలు గుర్తుకు వస్తాయి. అయితే ఇక్కడ అలా అనుకుంటే మాత్రం పెద్దపొరపాటే. హీరో వేరువేరుగా రెండు పేర్లతో ఈ సినిమాలు తీస్తే ఈ రెండు పేర్లు కలుపుకుంటే కూడా ఈయనకు తక్కువేనని చెప్పవచ్చు. ఈయన కార్పోరేషన్‌ లో ఒక చిన్నస్థాయి కాపలా ఉద్యోగి. అయితే ఈయన ఆడించే ఆట చాలా పెద్దది. రోజు లక్షల్లో జరిగే జూదాలే. ఉద్యోగం ముసుగులో ఈయన గ్యాంగ్‌ జూదరులకు గ్యాంగ్‌ లీడరే కాదు ముఠామేస్త్రీ కూడా. ఈ పేటకు నేనే మేస్త్రీ అన్న పాటకు ఆయన కరెక్టుగా సూట్‌ అవుతాడు. ప్రపంచంలో పేరుగాంచిన మంగంపేటకే అతి పెద్ద పేకాట మేస్త్రీగా ఈయనను పిలుస్తారు. అదే స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు కూడా. జూదగాళ్లకు ఈయనే అధిక వడ్డీకి అప్పులు ఇవ్వడం, అధికంగా లాభం పొందడం ఆనందం. పేకాట కోసం రోజుకో స్థావరం మారుస్తాడు. పోలీసులు పసిగట్టలేని పరిస్థితి కల్పిస్తారు.

ఏదైనా సమాచారంతో పట్టుబడితే వెంటనే పెద్ద నాయకుల నుంచి ఫోన్లు చేయించి వారిని దర్జాగా విడుదల చేస్తారన్న ఆరోపణలు వున్నాయి. వీటన్నింటికి సూత్రధారి గ్యాంగ్‌ లీడర్‌ ఆయనే. ఆ ముఠాకు ఏమిజరిగినా ఆ మేస్త్రీ ముందుంటారని అంటుంటారు. పేకాట రాయుళ్లకు వంద రూపాయలకు పది రూపాయలు వడ్డీ ఇది నెలకు కాదు ఒకరోజుకు. పోలీసులకు పట్టుబడితే విడిపించేందుకు ఒకరేటు. స్థావరాలకు ఇంకో రేటు. రోజుకు రెండు లక్షలు మొదలు కొని 5 లక్షల పైగా వరకు ఆట జరుగుతుందంటే అంతా ఇంతా ఆశ్చర్యం కాదు. ఆయనకు వచ్చే రోజువారి ఆదాయానికి, ఆనందానికి అవధుల్లేవని అక్కడి ప్రజలు అనుకుంటుంటే ఇంతకు మించిన ఆశ్చర్యం ఇంకోకటి లేదనిపిస్తోంది. ఈయన ఇలా ఆదాయంతో ఆనందం చెందితే ఈఆటకు లోనైన చిన్న చిన్న ఉద్యోగులు పేకాట వ్యసనపరుల కుటుంబాలు అప్పులతో చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడటం, కుటుంబాల్లో కలహాలు చోటు చేసుకోవడం, విడాకులు పరిస్థితులు కూడా దాపురించినట్లు తెలుస్తోంది. వీటిపై ఎక్కడ చూసినా చర్చలే చర్చలు. ఈ ఆనందాన్ని ఆపేదెవరో.. అదుపులోకి తెచ్చేదెప్పుడో ఎంత కాలం పడుతుందో చితికి పోయిన కుటుంబాలను చక్కదిద్దే దేవుడెవరోనని ఆ కుటుంబాల బాధలను అక్కడ వింటున్న వారు, చూస్తున్న వారు కథ‌లు కథలుగా చెప్పుకుంటుంటే ఎవరికైనా కడుపుతరుక్కు పోవాల్సిందే. అయితే ఈయన అదుపున‌కు ఏ అధికారి గానీ, ఎవ్వరూ కానీ పట్టించుకోక‌పోవడంతో కొన్నేళ్ళుగా జరుగుతున్న ఆయన ఆడిస్తున్న ఆటలకు ఆదాయ ఆనందాలకు అడ్డులు లేవు. ఒకటి రెండు దఫాలు కూడా పోలీసులకు పట్టుబడినా ప్రయోజనం లేకుండా పోయిందని అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement