Wednesday, May 8, 2024

Big Story: అతి ప్రాచీన సూర్య దేవాలయం.. ఎక్క‌డుందో తెలుసా!

సూర్య దేవాలయాలు భార‌త దేశంలోనే కాకుండా యూరప్ దేశాల్లో కూడా ఉండేవి. దానికి సంబంధించిన అతి ప్రాచీన చరిత్ర ఇప్పుడు మరోసారి బయటపడింది. అత్యంత పురాతనమైన సూర్య దేవాలయం ఈజిప్టులో పురావస్తు తవ్వకాల్లో వెలుగు చూసింది. ఆ విశేషాలేంటో చ‌ద‌వండి…

సూర్యుని పూజించే సంప్రదాయం కేవలం భార‌త‌దేశంలోనే కాదు.. ఒకప్పుడు యూరప్ కంట్రీస్‌లో కూడా ఉండేది. ఫిరౌన్ లేదా ఫారోహ్ (Pharaoh Dynasty) రాజుల కాలంలో ఈజిప్టు ఉన్నప్పుడు సూర్యుడిని, చంద్రుడిని ఇలా వివిధ రకాలుగా పూజించేవాళ్లు. ఈ త‌ర్వాత కాలంలో ఆ ఆచారం మారిపోయింది. అయితే అప్పట్లో రాజులు నిర్మించిన టెంపుల్స్‌ పురావస్తు శాఖ‌ తవ్వకాల్లో బయటపడుతూ ఆనాటి ఆచార సంప్ర‌దాయాల‌ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి..

ఈ మ‌ధ్య కాలంలో ఈజిప్టులో పురావస్తు శాఖ‌ జరిపిన తవ్వకాల్లో 4,500 ఏళ్లనాటి సూర్య దేవాలయం (Sun Temple) బ‌య‌ట‌ప‌డింది. దీన్ని ఈజిప్టు పురావస్తుశాఖ అధికారులు ధ్రువీకరించారు. 4 వేల 5 వందల ఏళ్ల క్రితం అంటే (Ancient Sun Temple) బీసీలో 25వ శతాబ్దం నాటి పురాతన సూర్య దేవాలయంగా పరిగణిస్తున్నారు పురావ‌స్తు శాఖ అధికారులు. ఈజిప్టును ఒకప్పుడు పాలించిన ఫిరౌన్‌ల కాలంలో ఆరు టెంపుల్స్‌ నిర్మించార‌ని.. కాగా, క‌నిపించ‌కుండా పోయిన వాటిలో ఇది ఒకటని ఆర్కియాల‌జీ డిపార్టెమెంట్ ఆఫీస‌ర్లు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement