Sunday, May 5, 2024

Municipal Elections Results : ఫలితాల్లో వైసీపీ హవా… అక్కడ టీడీపీ జయకేతం

ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఏడు మున్సిపాలిటీల్లో వైసీపీ, ఒక చోట టీడీపీ గెలుపొందింది. రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలు వైసీపీ విజయం సాధించింది. గురజాల, దాచేపల్లి,బేతంచర్ల, ఆకివీడులో వైసీపీ విజయం సాధించగా.. దర్శి మున్సిపాలిటీలో టీడీపీ గెలిచింది.

గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా, ఏడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.

ఇక, ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 13 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా.. వైసీపీ ఏడు స్థానాలకి వచ్చాయి. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో వైసీపీ ఖాతాలో పడింది. మొత్తం 20 వార్డుల్లో ఇప్పటికే 12 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ ఒక్క వార్డులో విజయం సాధించింది.

వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో మొత్తం 29 వార్డులకు గాను.. 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వైసీపీ 16 వార్డులను సొంతం చేసుకోగా.. టీడీపీ 3, ఇండిపెండెంట్ 1 వార్డును కైవసం చేసుకున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. 39వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1,390 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ 45వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ పాషా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 1,117 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్థికి 693 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, జనసేన అభ్యర్థికి 267 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. ఇందులో 23 చెల్లని ఓట్లు రాగా… నోటా కింద 42 ఓట్లు పోలయ్యాయి.

ఇది కూడా చదవండి: AP Municipal Elections Results: కుప్పంలో గెలుపు ఎవరిది ?

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement