Saturday, May 4, 2024

AP Municipal Elections Results: కుప్పంలో గెలుపు ఎవరిది ?

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కౌంటింగ్‌పై సర్వత్ర టెన్షన్ నెలకొంది. తొలిసారిగా జరుగుతున్న కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో పరువు కోసం టీడీపీ, పట్టు కోసం వైసీపీ ప్రయత్నించాయి. మొత్తం 25 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. 14 వ వార్డులో వైసీపీ అభ్యర్థి మునుస్వామి ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 24 వార్డుల్లో లెక్కింపు జరుగుతోంది. కుప్పంలోని ఎంఎఫ్ సీ ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి ఎస్ఈసీ నియామించింది.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో ఈ మున్సిపల్ ఎన్నికలను టీడీపీతోపాటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటీపోటీగా ప్రచారం చేశాయి. ఈ క్రమంలో మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ వర్సెస్ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నట్లు ప్రచారం సాగింది.  ఎన్నికల బరిలో మొత్తం 87 మంది అభ్యర్థులు నిలిచారు. 76.49. శాతం పోలింగ్ నమోదైంది. కుప్పం మునిపిపాలిటి పరిధిలో మొత్తం 39,259 మంది ఓటర్లు ఉండగా.. 28,942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement