Friday, April 26, 2024

కౌలు రైతు కుటుంబాలకు జనసేన అండ‌.. రూ.ల‌క్ష ఆర్థిక సాయం అందిస్తాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుబానికి రూ.7 లక్షల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆ హామీని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదట ఏడాది తూతూ మంత్రంగా సాయం చేసి రెండేళ్లుగా ముఖం చాటేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుబానికి జనసేన పార్టీ అండగా ఉంటుదని, వారికి కొంతైనా ఊరటనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి కుటుబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామన్నారు.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది పూజల అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ”కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు, ఆనందం రావాలనే కోరుకునే రోజు. కానీ కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటే బాధనిపిస్తోంది. పోరాట యాత్ర, మండపేట పర్యటన, కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో, నివర్‌ తుపాన్‌ సమయంలో స్వయంగా కౌలు రైతులతో మాట్లాడాను. వారు పడుతున్న బాధలు విని కన్నీరు వచ్చింది. వాళ్లు సాగు చేయడానికి సొంత భూమి లేకపోయినా.. కౌలు తీసుకుని సేద్యం చేస్తున్నారు. ఈ రోజు మనం తినే 80 శాతం తిండి కౌలు రైతు కష్టం, శ్రమ నుంచి వచ్చిందే. ఈ రోజు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ అంటు-న్నామంటే దానికి కారణం కౌలు రైతే. వాళ్లు కష్టపడి మన కడుపు నింపినందుకు వాళ్లుకు మనమిచ్చే బహుమతి 3 వేల చావులు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లర్లు.. దళారులు లాభపడుతున్నారు..
భూములను కౌలుకు తీసుకొని, ఎరువుల నుంచి విత్తనాల వరకు అప్పులు చేసి వ్యవసాయం చేస్తే కనీసం పండిన పంటకు గిట్టు-బాటు- ధర వచ్చే పరిస్థితి లేదని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చడానికి, భార్య, పిల్లల కడుపు నింపడానికి నిస్సహాయ స్థితిలో పండిన పంటను నష్టానికి అమ్ముకుంటు-న్నారన్నారు. రైతు దగ్గర నుంచి మిల్లర్లు, దళారులు ధాన్యం బస్తా రూ. 700కు కొని, దానిని రూ. 1400కు అమ్ముకొని లాభం చేసుకుంటు-న్నారని తెలిపారు. మన రాష్ట్రంలో అధికారిక అంచనాల ప్రకారం రూ. 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, కానీ అనధికారికంగా దానికి రెండింతలు అంటే దాదాపు 45 లక్షల మంది కౌలు రైతులు తమ శ్రమను ధారపోస్తే ఈ రోజు ప్రతి ఒక్కరం ఒక ముద్ద తింటు-న్నామని వివరించారు.

బాధిత కుటుబాలకు పరామర్శ కూడా లేదు
ఆర్టీఐ వివరాల ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 80 మంది.. అనంతపురం, కర్నూలు జిల్లాలో 150 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటు-ంబాలను పరామర్శించడానికి అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదన్నారు. ప్రతిపక్షాలుగా ఏదైనా మాట్లాడితే మన మీద విరుచుకుపడతారు తప్ప రైతుకు అండగా నిలబడటానికి మాత్రం ముందుకు రారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటు-ంబాన్ని ఆదుకోవడానికి ప్రతి జిల్లా కలెక్టర్‌ దగ్గర రూ. కోటి నిధి ఉంటు-ందని, అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని వివరించారు.

నష్టపరిహారం ఇచ్చే వరకు పోరాటం ఆగదు
ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటు-ంబాలకు జనసేన అండగా ఉంటు-ందని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వారికి కొంతైనా ఊరటనివ్వాలనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటు-ంబాలకు జనసేన పక్షాన రూ. లక్ష ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించామని వివరించారు. సమాచార హక్కు చట్టం కింద సేకరించిన సమాచారం ప్రకారం ఆత్మహత్యలకు పాల్పడ్డ ప్రతి కౌలు రైతు కుటు-ంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తానని చెప్పారు. లక్ష రూపాయల సాయం చిన్నదే కావొచ్చు కానీ అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదన్నారు. ‘మనమంతా ఉగాది పండగ జరుపుకొంటు-ంటే మీరు కన్నీరుపెడితే అది ఉగాది అవ్వదు. కౌలు రైతు కుటు-ంబాలు బాగుండాలి, వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆర్థిక సాయం అందిస్తున్నా’మని వివరించారు. కౌలు రైతులకు అండగా ఉంటామని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని భరోసా కల్పించారు.

- Advertisement -

ఈ ఉగాది వారి కుటు-ంబాలకు కొంత ఊరట ఇవ్వాలని కోరుకుంటు-న్నానన్నారు. భూ అధీకృత సాగుదారు చట్టం-2011 లోపభూయిష్టంగా ఉందని చెబుతూ వైసీపీ ప్రభుత్వం 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకువచ్చిందని, కానీ ఈ చట్టం మరింత లోపభూయిష్టంగా మారిందని, ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు ఇవ్వాలని వివరించారు. ఈ కార్డులు పొందాలంటే 11 నెలలకు సంబంధించిన కౌలు ఒప్పంద పత్రాలపై భూ యజమానులు సంతకాలు చేయాలని, భూ యజమానులు సంతకాలు చేయకపోవడంతో కౌలు రైతులకు కష్టాలు మరింత పెరిగాయని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని మార్చే విధంగా, ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటు-ంబాలకు నష్టపరిహారం అందిలా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement