Thursday, March 28, 2024

‘అంటే సుంద‌రానికి’ నుంచి ఫ‌స్ట్ సింగిల్.. ఎప్పుడంటే..

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే .. సుందరానికీస సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నటించింది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి. వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు మూవీ మేక‌ర్స్.

ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6:03 నిమిషాలకు ‘పంచె కట్టు’ అనే ఫస్టు సింగిల్ ను విడుదల చేయనున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి. ఈ సినిమా టైటిల్​తో పాటు నాని లుక్ తో 50 శాతం మార్కులు అప్పుడే కొట్టేసింది. ఆచార వ్యవహారాల మధ్య నలిగిపోయే యువకుడిలా నాని కనిపించనుండగా, లీలా థామస్ అనే మోడ్రన్ లేడీగా నజ్రియా ఆకట్టుకోనుంది. ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలతో ఈ కథ సరదాగా సాగుతుందని అనిపిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement