Thursday, May 16, 2024

చిత్తూరు జిల్లాలో భారీ వర్షం.. పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు

భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రహదారులు కూడా జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి వెస్ట్ చర్చి వద్ద ప్రమాదకర స్థాయికి నీటి ప్రవాహం చేరుకుంది. దీంతో వాహనాల అనుమతిని నిలిపివేశారు.

వాయుగుండం ప్రభావం తీవ్రంగా ఉండడంతో చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement