Monday, May 20, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షం.. నీట మునిగిన రామళ్లకోట గ్రామం

ఉమ్మడి జిల్లాలైన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఎడ‌తెరిపిలేకుండా వాన‌లు ప‌డడంతో ఉమ్మడి జిల్లాల్లో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

వర్షాల మూలంగా నంద్యాల జిల్లా వెల్దుర్తి మండలంలోని రామళ్లకోట గ్రామం నీటమునిగింది. గ్రామంలో నడుము లోతులో ఇళ్లలోకి నీరు ప్రవేశించాయి. దీంతో గ్రామస్తులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. రామళ్లకోట వంతెనపై నుంచి నీరు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ ఆటో నీటిలో కొట్టుకుపోయింది.

పొంగిపొర్లిన వక్కెరవాగు..
గూడూరు మండలం పెంచికలపాడు గ్రామం దగ్గర కర్నూలు, గూడూరు వెళ్లే రహదారిలో వక్కేర వాగు బ్రిడ్జిపై నుండి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహనాల‌ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తంగా కర్నూలు జిల్లాలో సగటున వర్షపాతం ఇప్పటి వరకు 22 మిల్లీ మీటర్లు నమోదైన‌ట్టు అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

కౌతాళం. మద్దికేర మండలంలో మినహా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలోని కల్లూరు మండలంలో ఇప్పటివరకు అధికంగా 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement