Wednesday, May 1, 2024

బంగారం కొనాల‌నుకుంటే మంచి ఛాన్స్ – రూ.వెయ్యి త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌

బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కాగా నేడు బంగారం ధ‌ర వెయ్యి రూపాయ‌లు త‌గ్గింది. గోల్డ్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. జూన్ 15న హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1050 పతనమైంది. రూ. 51,710కు తగ్గింది. 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అలాగే ఆర్నమెంటల్ గోల్డ్ 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. దీని రేటు రూ. 960 పడిపోయింది. 10 గ్రాములకు రూ. 47,400కు తగ్గింది.బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. సిల్వర్ రేటు ఏకంగా రూ. 1300 పతనమైంది. దీంతో కేజీ వెండి రేటు హైదరాబాద్‌లో రూ. 66 వేలకు పడిపోయింది. వెండి ఆభరణాలు, కడియాలు, పట్టీలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వెండి రేటు నిన్న కూడా పడిపోయింది. రూ. 300 తగ్గింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే సిల్వర్ రేటు రూ. 1500 దిగివచ్చిందని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement