Wednesday, May 1, 2024

పెరిగిన క‌రోనా కేసులు – కొత్త‌గా 6,594

క‌రోనా కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి. కొత్త‌గా 6,594కేసులు న‌మోద‌య్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 8822కు పెరిగింది. ఇది నిన్నటికంటే 33.7 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,32,45,517కు చేరాయి. ఇందులో 4,26,67,088 మంది బాధితులు కోలుకున్నారు. మరో 53,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,792 మంది మరణించారు. కాగా, కొత్తగా 15 మంది కరోనాకు బలవగా, 5718 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. రాష్ట్రంలో 2956 మందికి పాజిటివ్‌ రాగా, కేరళలో 1989, ఢిల్లీలో 1118, కర్ణాటకలో 594, హర్యానాలో 430 చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.12 శాతానికి చేరింది. రికవరీ రేటు 98.66 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ 2 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 1,95,50,87,271 మందికి కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement