Friday, April 26, 2024

నంద్యాల జిల్లాలో భారీ వ‌ర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు, వంక‌లు (వీడియో)

నంద్యాల జిల్లాలో నిన్న అర్ధ‌రాత్రి నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇవ్వాల తెల్ల‌వారు జాము వ‌ర‌కు దంచికొట్టిన వాన‌తో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. అవుకు మండలంలోని కొండమీద గ్రామాలలో ప‌రిస్థితి దారుణంగా మారింది. అవుకు పరిధిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా ఉప్పలపాడు, కునుకుంట్ల గ్రామాల మధ్యలో ఉన్న కాల్వగడ్డ వాగు బ్రిడ్జిపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ఉదయం పనులపై ద్విచక్ర వాహనాలలో బయటకు వెళ్లే వ్యక్తులు నిలిచిపోయారు.

la

వర్షాల రాకతో పంట భూములు చదును వేసుకోవడం, దుక్కి దున్నడం, ఇతర వ్యవసాయ పనులకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు పేర్కొన్నారు. ముఖ్యంగా కొండమీది గ్రామాలైన కునుకుంట్ల, ఉప్పలపాడు, జూనుతల, కొండమనాయుని పల్లి, మారేమడుగుల, గ్రామాల్లో మాత్రమే ఈ భారీ వర్షం కురిసింది. మండలంలోని మిగతా గ్రామాల్లో ఓ మోస్తారు వర్షంతో పాటు చిరుజల్లులు కురిశాయి. నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement