Sunday, April 28, 2024

త‌ప్పు ఎవ‌రు చేసినా శిక్ష త‌ప్ప‌దు – చంద్ర‌బాబుకి నోటీసులపై బొత్స‌..

అమ‌రావ‌తి – తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఎక్కువ రోజులు తప్పించుకోలేరని చెప్పారు. సీఐడీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అమరావతి పేరుతో భూ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షంలోనే చెప్పామన్నారు. ప్రభుత్వానికి కక్షసాధించాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు జవాడుదారీగా ఉండాలన్నారు. నిన్నటి వరకు తాము తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. సీఐడీ నోటీసులు ఇవ్వగానే కక్షసాధింపు అంటున్నారని తెలిపారు. తప్పు చేయకపోతే చంద్రబాబుకు భయమెందుకని నిలదీశారు.

సిఐడి విచార‌ణ‌కు హాజర‌వ్వాల్సిందే…. లేళ్ల అప్పిరెడ్డి…

అమరావతి భూ కుంభకోణం అంశంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే ధైర్యంగా సీఐడీ విచారణను ఎదుర్కోవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చాలెంజ్‌ విసిరారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి, కొత్త రాజధాని పేరుతో టీడీపీ అర్ధాంతరంగా హైదరాబాద్‌ నుంచి అమరావతిలో ఊడిపడి..ఎవరికి చెప్పకుండా, ఫలాని చోట రాజధాని వస్తుందని అందరిని మభ్యపెట్టి..చంద్రబాబు తన అనుయాయులకు మాత్రమే అమరావతిలో రాజధాని అని చెప్పి భూములు కొనుగోలు చేయించారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు రహస్యంగా ఉండాల్సింది పోయి..తన వారికి ముందే లీకులిచ్చి..తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయించి..రాజధానిని రియల్‌ ఎస్టేట్‌ ఏరియగా మార్చారు. గత ఐదేళ్లు యధేచ్చగా జీవోలు ఇచ్చి, వారికి అనుకూలంగా, కావాల్సిన విధంగా భూములు అప్పన్నంగా అప్పజెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement