Saturday, April 27, 2024

అలియాభట్ ను బీనా ఆంటీ తో పోల్చిన నెటిజన్లు.. !!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రాంచరణ్, ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియోలు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామ్ చరణ్ సరసన అలియాభట్ సీత గా కనిపించనుంది. ఇదిలా ఉండగా అలియాభట్ లుక్ ని చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలియా పై ఏం సెటైర్లు అనుకుంటున్నారా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసే ఉంటారు కదా.. అందులో బిజీ అంటీ తెలిసే ఉంటుంది. అలియాని చూస్తుంటే బీనా ఆంటీ గుర్తొస్తుందని కామెంట్ చేస్తున్నారు. అలియా ఫోటోని బీనా ఆంటీ ఫోటోని పక్క పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement