Thursday, March 28, 2024

దక్షిణ కొరియాతో అమెరికా సైనిక విన్యాసాలని వ్యతిరేకించిన ఉత్తర కొరియా

అమెరికా, ఉత్తర కొరియా మధ్య మరోసారి వివాదాలు చెలరేగుతున్నాచి. ట్రంప్ అనంతరం అధ్యక్ష పదవి చేపట్టిన జో బైడెన్ విధానలతో ఉత్తర కొరియా అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంట్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ అమెరికాకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. హాయిగా నిద్రపోవాలనుకుంటే పిచ్చి పిచ్చి పనులను మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు.  అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ లు జపాన్, దక్షిణ కొరియా పర్యటనలను ప్రారంభించారు.

దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తేల్చి చెప్పారు. అది ఉత్తర కొరియాపైన దాడికి సంకేతాలేనని అన్నారు. దక్షిణ కొరియా ‘యుద్ధ పథం’, ‘సంక్షోభ పథం’ దిశగా సాగేందుకే ఆసక్తి చూపిస్తోందని మండిపడ్డారు. కాగా, ఉత్తర కొరియాపై విధాన నిర్ణయాలను సిద్ధం చేసినట్టు బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. వాటిని వచ్చే నెలలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

కొత్త అధ్యక్షుడు జో బైడెన్ పేరును ప్రస్తావించకుండానే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు కిమ్ సోదరి. “మా నేల, నీటి మీద విషం చిమ్మాలని చూస్తున్న అమెరికాకు, ఆ దేశ కొత్త ప్రభుత్వానికి నేనో మాట చెప్పదలచుకున్నా. రాబోయే నాలుగేళ్లు హాయిగా నిద్రపోవాలనుకుంటే.. పిచ్చి పిచ్చి పనులను చేయడం మానుకోవాలి’’ అంటూ కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. గతంలోను ట్రంప్ సర్కారును కిమ్ జోన్ ఉన్ మీట్ నొక్కుతాతని హెచ్చరించారు. ఇప్పుడు మరోసారి అగ్రరాజ్యానికి ఉత్తర కొరియా కొరకరాని కొయ్యగా తయారైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement