Saturday, May 4, 2024

ఏక‌గ్రీవాల హోరు – వైసిపి జోరు..

అమరావతి, : పురపాలక ఎన్నికల్లోనూ వైసీపీ తన జోరును కొనసాగిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయి పైచేయి సాధించిన అధికార వైసీపీ తాజాగా నగర, పురపాలక ఎన్నికలకు సంబంధించి అత్యధిక స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రాష్ట్రంలో సరికొత్త రికార్డు సృష్టి ంచింది. రాష్ట్రంలో ఈ నెల 10వ తేది జరగనున్న నగరపాలక, పురపాలక ఎన్నికలకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో 3 వేల మంది అభ్యర్థులు తమ నామినేషన్ల ను ఉపసంహరించుకున్నారు. దీంతో అత్యధిక మంది మున్సిపల్‌ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో 17418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాలు చేశారు. వారిలో 3 వేల మందికి పైగా ్అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీల ను అధికార వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఆయా నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో ఎన్నికల కంటే ముందే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలోనే అత్యధిక వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తం గా చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీ తతల్లో వైసీపీ జెండా ఎగరనుంది. ప్రత్యేకించి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తు న్న కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో అన్నీ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఆ మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో చేరింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇదో సరికొత్త రికార్డు. వీటితో పాటు గుంటూరు జిల్లా మాచ ర్ల, దుగిరాల, పుంగనూరు, పలమనేరు, నాయుడు పేట, డోన్‌ మున్సిపాలిటీల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. దీంతో ఆయా పురపా లక సంఘాల్లో కూడా వైసీపీ జెండా రెపరెపలాడనుంది.
పులివెందులలో వైసీపీ సరికొత్త రికార్డు
సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 33 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. దీంతో పులివెం దులకు ఎన్నికలతో అవసరం లేకుండానే మున్సిపాలి టీని వైసీపీ సొంతం చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇదో సరికొత్త రికార్డు. గతంలో ఒకే పురపాలక సంఘం లో ఇన్ని వార్డులు ఏకగ్రీవం కావడం ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం కూడా ఇదే మొదటిసారి. సొంత జిల్లాలో తనకు తిరుగులేదని సీఎం జగన్‌ మరోసారి చాటుకున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు మొదలు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో వైసీపీ హవా స్పష్ట ంగా కనిపించింది. ప్రస్తుత పురపాలక ఎన్నికల్లో కూడా అదే జోరు కొనసాగింది.
ఏకగ్రీవాల్లో.. వైసీపీ జోరు
అదేవిధంగా కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ లో 34 వార్డుల్లో 31 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు 12 స్థానాలు, అలాగే కడప కార్పొరేషన్‌లో 50 డివిజన్ల లో 23 స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వీటితో పాటు కర్నూలు జిల్లాలో డోన్‌, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో కూడా వైసీపీ జోరు కొనసాగింది. డోన్‌ పరిధిలో 32 వార్డులకు గాను 22 వార్డులను వైసీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అలాగే ఆత్మకూరులో 24 వార్డులకు గాను 15 వార్డులు, కర్నూలు కార్పొరేషన్‌లో కూడా పలు డివిజన్ల ను వైసీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం మున్సి పాలిటీలో 28 వార్డులకు గాను 10 వార్డులు, తునిలో 30 వార్డులకు గాను 15 వార్డులను వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 22 వార్డులు, సూళ్లూరుపేటలో 25 వార్డులకు గాను 13 వార్డులను వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.
నేటి నుంచి ప్రచార జోరు
మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. దీంతో 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో ఏకగ్రీవం కాగా మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో గురువారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఆయా నగరపాలక, పురపాలక సంఘాల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న అభ్యర్థులంతా గెలుపు కోసం ముమ్మర ప్రచారాన్ని చేపట్టబోతున్నారు. ప్రధాన పార్టీల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతుండడంతో పట్టణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement