Friday, April 26, 2024

మతసామరస్యాన్ని కాపాడే రచనలను ప్రోత్సహించాలి : వైస్ చాన్సలర్

తెనాలి : మత సామరస్యాన్ని కాపాడే రచనల అవసరత ఎంతైనా ఉందని, అలాంటి రచనలు చేస్తున్న రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరముంద‌ని దళిత సార్వత్రిక విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అన్నారు. కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్ లో ఆదివారం రాత్రి పట్టణానికి చెందిన రచయిత కనపర్తి డేవిడ్ రచించిన సాక్షాత్కారము పుస్తక ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. సభకు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ అధ్యక్షత వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని సాక్షాత్కారము పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య కృపాచారి మాట్లాడుతూ… కనపర్తి కలం పేరుతో రచనలు చేస్తున్న రచయిత డేవిడ్ మత గ్రంథాల్లోన్ని సారాంశాలను సులువైన రీతిలో సామాన్యులకు అర్థమయ్యేలా రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, సహజకవి అయినాల మల్లేశ్వరరావు సాక్షాత్కారము పుస్తక విశ్లేషణ చేసారు. అధ్యక్షత వహించిన డాక్టర్ అబ్రహాం లింకన్ మాట్లాడుతూ… ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరచు కోవాలని ఇందుకు సాక్షాత్కారము వంటి రచనలు ఉపయోగపడతాయన్నారు. రెవరెండ్ డి. సాల్మన్ రాజు మాట్లాడుతూ… పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం హర్షణీయమ‌న్నారు. అనంతరం సాక్షాత్కారము పుస్తక రచయిత డేవిడ్ ను పలువురు సాహితీవేత్తలు, కవులు, కళాకారులు సత్కరించారు. సభలో కనపర్తి కృపాదాసు, బాబురావు, ఏసురత్నం, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్.అండ్ రాజు, ఉపాధ్యాయులు విజయ ప్రకాష్, బెన్ హర్, వెంకటేశ్వరరావు, అంబేద్కర్, గోగినేని రత్నాకర్, పాతూరి సుబ్రహ్మణ్యం, సుధీర్, రవికిరణ్, పీ.గోపి, పాత్రికేయులు టి.రవీంద్రబాబు, గుమ్మడి ప్రకాశరావు, జి. ప్రభాకర్, శ్రీకాంత్, జహీర్, ప్రేమ కుమార్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement