Friday, April 26, 2024

ఎడతెరపి లేని వర్షాలతో కుదేలైన రైతు… ఆదుకోమంటూ ఎమ్మెల్యే వేగుళ్ళ డిమాండ్…

మండపేట : ఎడతెరపి లేని వర్షాలతో చేతికి వచ్చిన పంటను నష్టపోయి కుదేలైన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  డిమాండ్ చేశారు. మండపేట మండలం ఇప్పనపాడు, కేశవరం, ద్వారపూడి గ్రామాలలో ఆయన పర్యటించారు. నీటమునిగిన పంటపొలాలను, ఆరబెట్టిన ధాన్యం కళ్ళాలను పరిశీలించారు. కేశవరం గ్రామంలో ట్రాక్టర్ పై వెళ్ళి పంటపొలాలను పరిశీలించారు. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన పంటను రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. వ్యవసాయ సాగుకు పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్ధితి లేదన్నారు. కూలీల కొరత, డీజిల్ ధరలు పెరిగిపోవటంతో తమకు మోయలేని భారం పడిందని పలువురు రైతులు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకువచ్చారు.

మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవటంలేదని వారు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చోడె పాపారావు, తిరుశూల వీరవెంకట సత్యనారాయణ, రిమ్మలపూడి వాసు, రిమ్మలపూడి సత్యనారాయణ, నొక్కు వెంకటరమణ, జనపరెడ్డి ఆనందరావు, గుత్తుల చంద్రరావు, ఊలపల్లి వెంకటరమణ, కేశవరం సర్పంచ్ పెదపాటి సత్యనారాయణమూర్తి, కర్రి తాతారావు, కంటిపూడి శ్రీనివాసరావు, ఆళ్ళ రాజుబాబు, గుడ్ల చంద్రరావు, పెదపాటి సీతారాం, కూసు మునియ్య, గెద్దాడ సుబ్బన్న, పల్లేటి రవి, తొర్లపాటి ప్రసాద్, ఉండమట్ల రామకృష్ణ, అడబాల బుల్లబ్బు, ద్వారపూడి మాజీ సర్పంచ్ శ్రీమతి తొర్లపాటి ఉషాశ్రీ లాజరు, పల్ల బాబు, పల్ల వీరబాబు, గోనం పుల్లయ్య, రెడ్డిపల్లి చిన్నారావు, యరతగపు గణేష్, తదితర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement