Saturday, April 27, 2024

చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా చేపట్టాలి: సీఎం జగన్

రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని సీఎం మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. చెట్లను పెంచడం చాలా అవసరమని సీఎం జగన్ అన్నారు. చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Tokyo Olympics: స్టార్​ రెజ్లర్​ వినేష్​ ఫొగాట్ ఓటమి

Advertisement

తాజా వార్తలు

Advertisement