Saturday, April 27, 2024

Tokyo Olympics: స్టార్​ రెజ్లర్​ వినేష్​ ఫొగాట్ ఓటమి

టోక్యో ఒలింపిక్స్​ లో భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. అయితే కాంస్యం కోసం పోరాడేందుకు ఆమెకు మరో అవకాశం లభించే వీలుంది. అయినప్పటికీ టోక్యోలో ఆమెకు మరో అవకాశం ఉంది.

టోక్యో ఒలింపిక్స్ 53 కిలోల కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్, తొలి రౌండ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. స్వీడెన్ రెజ్లర్ సోఫియా మాట్‌సన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7-1 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా భారీ అంచనాలతో బరిలో దిగిన వినేష్ పోటీ మధ్యలో గాయపడింది. గాయం తీవ్రత కారణంగా లేవడానికి కూడా కష్టపడిన వినేష్.. ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలిసి వచ్చింది. 2016లో 50 కిలోల కేటగిరీలో పోటీపడ్డ వినేష్, 2019 లో 50 కిలోల కేటగిరీ నుండి 53 కిలోల కేటగిరీకి మారింది.

మరోవైపు మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్​ రెజ్లింగ్​ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్​ రౌండ్​లో ఓటమి పాలైంది. రష్యన్ క్రీడాకారిణి వలెరియా కొబ్లోవా చేతిలో పరాజయం చెందింది. దీంతో పతకం సాధించకుండానే అన్షూ మాలిక్ నిరాశగా ఇంటిదారి పట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement