Friday, March 29, 2024

ఓటీటీలోనే.. నాని ‘టక్ జగదీష్’

నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం వెల్లడించే అవకాశాలున్నాయి. గతంలో ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయంతో నిర్మాతలు ఇప్పటివరకు వెయిట్ చేశారు. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నా ఆశించిన స్థాయిలో జనాలు రావడం లేదు. గత వారం విడుదలైన సినిమాలు చూసేందుకు జనం థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. పోనీ వీకెండ్‌లో అయినా కలెక్షన్లు పుంజుకోకపోవడంతో వసూళ్ల విషయంలో నిరాశనే మిగిలింది.

ఈ నేపథ్యంలో నాని నటించిన ‘టక్ జగదీష్’ నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ఓటీటీ నుంచి మంచి ఆఫర్లు ఉన్నప్పుడు, రిస్క్ చేయడం అవసరమా? అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో నాని కూడా ఈ విషయాన్ని నిర్మాతల ఇష్టానికే వదిలేశాడని ఫిలింనగర్‌లో టాక్ వినపడుతోంది. తాజా పరిణామాలతో సెప్టెంబరు నెలలో ఓటీటీ ద్వారానే ఈ సినిమా పలకరించనుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఈ వార్త కూడా చదవండి: నిహారిక ఇంట్లో గొడవ… భర్తపై న్యూసెన్స్ కేసు

Advertisement

తాజా వార్తలు

Advertisement