Monday, May 17, 2021

కోవిడ్ అనాధ పార్థివ దేహాలకు ఎమ్మెల్యే భూమన అంతిమ సంస్కారాలు

తిరుపతి ప్రభ : కోవిడ్ కారణంగా మనలో భయం,అందోళనలు మానవత్వాన్ని దూరంచేసి రుయాలో చనిపోయిన వారి పార్థివ దేహాలు తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో నేడు 21 పార్థివ దేహాలకు తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి అంతా తానై అంతిమ సంస్కారాలు జరిపారు. బుధవారం ఉదయం రుయా మార్చురీలో కోవిడ్ మరణాల వల్ల చనిపోయిన 21 మందికి సాంప్రదాయ రీతిలో పూలమాలలు వేసి స్వయంగా మహా ప్రస్థానం, ముస్లిమ్ జెయిసి వాహనాల్లో పార్థివ దేహాలు వుంచి ఖననం కోసం తరలించారు. తిరుపతి శాసన సభ్యులు మాట్లాడుతూ నిన్నటి వరకు అత్యంత ఆత్మీయులుగా మనతో , మన మధ్య తిరిగి వారు కరోనా కారణంగా చనిపోయిన వారిని మానవత్వం లేకుండా వదలి వెళ్లి వెళ్ళేవారు, మరి కొంతమంది కుటుంబం అంతా కరోనా భారిన పడి అంతిమ సంస్కారాలు నోచుకోలేకపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసేరు. దీనికి ఆర్ధిక సమస్య ఏమాత్రం కాదు హార్ద్తిక సమస్య ఎక్కడో కరోనా భయం అన్నారు. గతసంవత్సరం నాతోటి మిత్రులు, సహచరులు ముస్లిమ్ జే ఎ సి గా ఏర్పడి అన్నీతామై నేటివరకు 501 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల మంది ప్రజలు వున్నా చనిపోతున్న వారి సంఖ్య తక్కువే, తిరుపతిలో కూడా కోవిడ్ మరణాలు జరుగుతున్నాయని అన్నారు. కోవిడ్ తో చనిపోయిన వారిని ఖననం చేయడం వారి బందులు ఇష్టపడటం లేదు. నాకు 60 సంవత్సరాల వయస్సు పై బడ్డా, రెండు సార్లు కోవిడ్ సోకినా బయపడలేదని అన్నారు. మనలో వున్న అకారణ భయం తొలగించడానికి శాసన సభ్యునిగా నా భాద్యతగా ఈ దహన సంస్కారాలు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. ప్రజలు కోవిడ్ భారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముస్లిమ్ జే ఎ సి సోదరులకు పి.పి.ఇ. కిట్లు ఎం.ఎల్.ఎ.అందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిమ్ జె ఎస్ ఇ సి ఇమామ్ , ప్రభుత్వ మహాప్రస్థానం వాహనాలో పార్థివ దేహాలను తరలించగా, కార్పొరేటర్లు వెంకటేష్, నరేంద్ర, ఎస్.కె.బాబు, రుయా డెవెలప్ మెంట్ కమిటీ, వర్కింగ్ చైర్మన్ చంద్రశేఖర్, సూపర్నెంట్ డా. భారతి , పోలీసులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News