Sunday, May 16, 2021

హైదరాబాద్‌లో పట్టపగలే ఇద్దరు సజీవదహనం

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పల్ ప్రాంతంలో విద్యుత్ వైర్లు ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఉప్పల్ నుంచి రామంతాపూర్ వెళ్లే దారిలో మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు కంటైనర్‌కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో కంటైనర్‌లోనే ఉన్న డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాగా సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్ధలానికి వెళ్లి మంటలను ఆర్పారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో పట్టపగలే ఇద్దరు సజీవదహనం
Advertisement

తాజా వార్తలు

Prabha News