Wednesday, May 19, 2021

పుష్ప పై రంగమ్మత్త ఆసక్తికర వ్యాఖ్యలు !!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. మరోవైపు ఓ కీలక పాత్రలో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం షూటింగ్ లో అడుగు పెట్టిన విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను చేసే పాత్ర గురించి డీటెయిల్స్ పెద్ద గా చెప్పను కానీ…గతంలో రంగస్థలంలో రంగమ్మత్త గా ఎంతటి పేరు వచ్చిందో…. పుష్ప కు అంతకుమించి పేరు వస్తుందని చెప్పుకొచ్చింది. మరి సుకుమార్ అనసూయ కోసం ఎలాంటి ఈ పాత్రను సృష్టించారో తెలియాలంటే… సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News