Sunday, May 19, 2024

ఏపీలో పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి!

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సురేష్ ఫలితాలను విడుదల చేశారు. హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఫలితాలను www.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాదితో పాటు గతేడాది(2020) ఫలితాలను సైతం మంత్రి విడుదల చేశారు. ప్రతిభను ప్రధానంగా తీసుకుని ఎవరికి నష్టం కాకుండా ఫలితాలను ప్రకటించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని గతంలో సీఎం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఫలితాలతో ఎవరికీ నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. గతేదికి సంబంధించి 6,37,354 విద్యార్థులకు గాను 3,26,753 బాలురు, 3,10,601 మంది బాలురకు గ్రేడింగ్స్ ఇచ్చామని మంత్రి చెప్పారు. 

కరోనా కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అందరినీ ఉత్తర్ణులుగా ప్రకటించిన ప్రభుత్వం మార్కులు కేటాయించలేదు. కేవలం పాసైనట్లు మెమోలు అందించారు. అయితే ఈ సారి వారికి కూడా మార్కులు కేటాయించనున్నారు. హైపవర్ కమిటీ ఇచ్చిన ఫార్ములా ఆధారంగా 2019-20లో పదో తరగతి సమ్మెటివ్ అసెస్మెంట్‌‌కు 50 శాతం వెయిటేజీ… మూడు ఫార్మాటివ్ అసెస్మెంట్‌లకు కలిపి 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్‌ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్‌ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్‌ ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరించారు. వొకేషనల్‌ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement