Wednesday, May 22, 2024

వాలంటరీ వ్యవస్థ తోనే వైయస్సార్ గెలుపు – మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల

ధర్మవరం అర్బన్ – వాలంటరీ వ్యవస్థ ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దొడ్డిదారిన విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తెలిపారు. వ్యక్తిగత కార్యాలయంలో ఆయ‌న విలేకరుల మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వాలెంటరీ వ్యవస్థతోపాటు, పోలీస్ రెవెన్యూ, మున్సిపల్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందని అధికార పార్టీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామని బెదిరించడంతో నే ప్రజలు అధికార పార్టీకి భయంతో ఓటు వేశారన్నారు. బీజేపీ కార్యకర్తల పై అక్రమ కేసులను బనాయిస్తున్నారని పోలీసులు తమ తప్పును సరిదిద్దుకో కపోతే పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసమే జిల్లా కలెక్టర్ ను ఎమ్మెల్యే విమర్శించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదని అధికార పార్టీ కి అనుకూలంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించారని ఆధారాలతో సహా అలాంటి వారిపై ఫిర్యాదు చేస్తామన్నారు. త్వరలోనే 50 ఇండ్లకు ఒక బీజేపీ కార్యకర్త నియమించి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న బిజెపి కార్యకర్త శివ శంకర్ కు మాజీ ఎమ్మెల్యే పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుదర్శన్ రెడ్డి, డిష్ రాజు, అంబా రపు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement