Sunday, April 28, 2024

ఇటు హర్షం – అటు నిరసన

వైఎస్సార్ విగ్రహానికి రెవెన్యూ అధికారుల పాలాభిషేకం

జాతీయ రహదారిపై పంచాయతీ ఉద్యోగుల ర్యాలీ, నిరసన

డీడీఓ వ్యవస్థలో మార్పులపై రెవెన్యూ, పంచాయతీ రాజ్ లో భిన్నాభిప్రాయాలు

పులిచెర్ల, గ్రామ సచివాలయాలు, గ్రామ పంచాయతీల డ్రాయింగ్ ఆఫీసర్లు(డీడీఓ) మార్పు తీసుకొస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబర్ 2పై ఇటు వైపు రెవెన్యూ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తుంటే అటు వైపు పంచాయతీ రాజ్ సిబ్బంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పులిచెర్ల మండలం కల్లూరులో జీఓ నెంబర్ 2 విడుదలపై మంగళవారం మండల వీఆర్ఓ సంఘం అధ్యక్షులు సురేంద్ర ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎంపీడీఓ దేవేంద్రబాబు, ఈఓ పీ ఆర్డీ యుగంధర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పంచాయతీ రాజ్ ఉద్యోగులు ర్యాలీ, నిరసన చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ దేవేంద్రబాబు మాట్లాడుతూ పంచాయతీ వ్యవస్థను నీరు గార్చేందుకు దోహద పడే జీఓ నెంబర్ 2ను వెంటనే రద్దుచేయలన్నారు. సర్పంచ్, కార్యదర్శి హక్కులను కలరాసే ప్రయత్నం మొదలు కావడం బాధాకరమని తెలిపారు. గ్రామ పంచాయతీలకు పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి, గ్రామ సచివాలయాలకు వీఆర్ఓ లను వేర్వేరుగా డీడీఓల నియమించడం సరికాదని తెలిపారు. మండల వీఆర్ఓ సంఘం అధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీడీఓ వ్యవస్థను తీసుకొస్తూ వీఆర్ఓ లకు డీడీఓ బాధ్యతలు అప్పగిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్సులు నాగరాజప్రసాద్, రమేష్, శ్రీబాబు, వీఆర్ఓ లు యోగేంద్రకుమార్, హరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement