Friday, May 3, 2024

RCB vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగ‌నుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మ్యాచ్ జ‌రుగుతుంది.

- Advertisement -

ప్రస్తుతం గుజరాత్ పాయింట్ల పట్టికలో 9 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలిచి 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఇక, ఆర్సీబీ 9 మ్యాచ్ లు ఆడి కేవలం రెండిట్లో గెలిచి చివరి ప్లేస్ కొనసాగుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్ లు జరిగాయి. గుజరాత్ 2 సార్లు విజయం సాధించగా ఆర్సీబీ ఒకసారి గెలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement