Monday, May 6, 2024

విశ్వామిత్రుడు- బ్రాహ్మణత్త్వం

”బ్రహ్మణ్యో బ్రహ్మకృత్‌ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్థన:
బ్రహ్మ విద్‌ బ్రాహ్మణో బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ:”

విష్ణు సహస్ర నామాలులో (71 శ్లోకం)

అని ఉంటుంది. అంటే వేదములు, తపస్సు, విప్రులు, జ్ఞానం ఇవన్నీ బ్రాహ్మణ త్త్వం చేత చెప్పబడుతున్నవి. వేద స్వరూపాన్ని వివరించేవారు బ్రాహ్మణులు. బ్రహ్మ జ్ఞానము పొందిన వారే బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మణులే నాకు ప్రియులు” అని అర్థం. ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మం అంటే సత్యం. సత్యం అంటే జ్ఞానం. అనంతమై న జ్ఞానం పొందాలంటే వేదాభ్యసనం ముఖ్యం. వేదములు, ఉపనిషత్తులు సారం గ్ర హంచి నడుచుకోవాలి. అటువంటి వేదాభ్యాసానికి బ్రహ్మోపదేశం (ఉపనయన సం స్కారం) పొందాలి. అపుడే ద్విజుడు అంటారు.
బ్రహ్మోపదేశంలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తారు. అప్పటి నుండి సంధ్యావం దనం అనుసరించాలి. అంతటి పవిత్రమైన మనోభీష్ఠి సిద్ధిని కలుగచేసే గాయత్రీ మం త్రం ద్రష్ట విశ్వామిత్రుడు. బ్రహ్మర్షి కావాలనే సంకల్పంతో ఎన్నో వేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసాడు. ఆఖరికి బ్రహ్మ, వశిష్ఠ మహర్షిల చేత బ్రహ్మర్షి అని పిలి పించుకొన్న మహనీయుడు.
ఒకసారి ధర్మరాజు భీష్మాచార్యులను సందర్శించి ”తాతా! బ్రాహ్మణత్త్వం ఇత రులు పొందకూడనిది, పొందలేనిదని అంటుంటారే, మరి క్షత్రియ వంశంలో పుట్టి న విశ్వామిత్రుడు బ్రాహ్మణత్త్వం ఎలా పొందాడు? వివరించమ”ని కోరగా- భీష్ముడు బదులిస్తూ ”కుశిక వంశంలో (జహ్నుని) గాధి అనే రాజు ఉండేవాడు. అతడి కూతు రు సత్యవతి. సుగుణాల రాశి భగు వంశానికి చెందిన ఋచీకుడు అనే విప్రుడు, గాధిని సందర్శించి, ఆయన కూతురు సత్యవతిని ఇచ్చి వివాహం చేయమని కోరాడు. గాధికి ఇష్టంలేదు. ఎందుకంటే వచ్చినవాడు బ్రాహ్మణుడు. తనేమో క్షత్రియ వంశం. ఆలో చించి, ”మహర్షి! ఒక చెవి నల్లగా ఉండే వేయి తెల్ల గుర్రాలను కన్యాశుల్కంగా ఇస్తే నే ను ఈ వివాహానికి అంగీకరిస్తాన”ని చెప్పారు.
అభిమాన ధనుడైన ఋచీకుడు, వెంటనే వరుణుడు వద్దకు వెళ్లి యాచించాడు. అపుడు వరుణుడు ”నువ్వు నియమంతో సంకల్పించుకొంటే, అక్కడే నీకు కోరిన వి ధంగా వెయ్యి గుర్రాలు పుడతాయ”ని వరం ఇచ్చాడు. అపుడు ఋచీకుడు గంగానది ఒడ్డున సంకల్పించుకొనగానే, ఒక చెవి నల్లగా ఉండి, తెల్లటి వేయి గుర్రాలు నేలనుండి పుట్టాయి. (గంగానదీ తీర ప్రాంతంలో కన్యాకుబ్జానికి దగ్గరగా అశ్వతీర్థం అని ఉంది ఇప్పటికీ. అక్కడే ఈ వేయి గుర్రాలు పుట్టాయి.)
ఋచీకుడు ఆ గుర్రాలను గాధికి కన్యాశుల్కం క్రింద సమర్పించగానే, సంతో షంతోను, ఆశ్చర్యంతోను, కాదంటే శాప భయంతో ఆలోచనలో పడ్డాడు. మాట తప్పకూడదని గ్రహంచి, తన కూతురు సత్యవతిని ఇచ్చి వివాహం చేశాడు.
సత్యవతి భర్తతో ఆశ్రమం జీవితానికి అలవాటు పడుతోంది. కొంతకాలం తర్వా త ఋచీకుడు భార్య సత్యవతితో ”నీకు సంతానాన్ని ప్రసాదించే చరువు (హోమ ద్రవ్యం) హోమం చేసి సంపాదించి ఇస్తాను” అన్నాడు.
సత్యవతి తల్లి అల్లుడి ప్రతిభను, తపోబలాన్ని గుర్తించి, కూతురుతో—”నాకు కూడా హోమ ద్రవ్యం వలన పుత్ర సంతానం కలిగేటట్లుగా చేయమని నీ భర్తకు చె ప్పు” అని కోరింది. తల్లి కోరికను కూడా భర్త ఋచీకుడుకు తెలియచేసింది. తరువాత ఆయన రెండు చరువులు పట్టుకొచ్చి, భార్య చేతికి ఇస్తూ ”ఇది స్వీకరిస్తే గొప్పగా వెలుగొందే బ్రాహ్మణత్త్వం కల కుమారుడు జన్మిస్తాడు. రెండవది ఇస్తూ ”దీనివల్ల తీవ్రమైన రాజ భావం కలిగిన పుత్రుడు జన్మిస్తాడు. కాబట్టి నువ్వు బ్రాహ్మణత్త్వంతో జన్మించే పుత్రుడు ను ప్రసాదించే హోమ ద్రవ్యాన్ని స్వీకరించి ఋతుకాలంలో నీవు మేడిచెట్టును, మీ తల్లి రావిచెట్టును కౌగలించుకోవాల”ని చెప్పాడు.
తరువాత, వారు వాటిని ఉపయోగించే సమయానికి, విధివశాత్తునో, దైవసంక ల్పమో, తారుమారు అయ్యాయి. అంటే తల్లిది కూతురుకి, కూతురుది తల్లికి వచ్చా యి. హోమ ద్రవ్యాన్ని స్వీకరించిన తర్వాత వారివురు గర్భం ధరించారు. ఋచీకు డు మహాజ్ఞాని. కనుక తన భార్య గర్భస్థితిని పరీక్షించి, ”సాధ్వీమణీ! నీ కడుపులో పెరుగుతున్న శిశువు దుర్మార్గుడైన రాచకుమారుడు కాగలడు తప్ప, బ్రాహ్మణుడు కాలేడు. మీరు చరువులు తారుమారు చేసుకోవడంవల్ల ఇలా జరిగింది” అని చెప్పగా నే, భార్య దు:ఖంతో ”మీరు జ్ఞాన సంపన్నులు. మనకు పుట్టబోయే పుత్రుడు బ్రాహ్మ ణత్త్వం లేనివాడైతే, లోకం మెచ్చుకోదు. పైగా హనంగా చూస్తారు. మీరు నామీద దయతో మీ తపస్సు, జ్ఞానంతో బ్రాహ్మణత్త్వం పొందేవిధంగా చేయండి” అని వేడు కొంది. అపుడు ఆ మహర్షి దయతో నీకు పుట్టబోయే బిడ్డ బ్రాహ్మణుడు అవుతాడు. కానీ వాడికి కలిగే పుత్రుడు మాత్రం రాజ లక్షణాలు కలిగి ఉంటాడు.” అని చెప్పి ఆమె కు కొంత ఉపశమనం కలిగించాడు. ఆవిధంగా సత్యవతికి బ్రాహ్మణుడైన జమదగ్ని జన్మించాడు. అతని కొడుకుగా రాజలక్షణాలతో క్షత్రియ తేజస్సుతో పరుశురాముడు జన్మించారు. సత్యవతి తల్లికి, అంటే గాధి భార్యకు విశ్వామిత్రుడు జన్మించాడు.
జన్మత: రాజవంశంలో జన్మించినా, బ్రహ్మర్షి కావాలనే తపనతో వేల సంవత్స రాలు ఘోరమైన తపస్సు చేసాడు. తపస్సు చేస్తున్న కాలంలో ఇంద్రుడు అప్సరస, రంభలను పంపి తపోభంగం కావించాడు. అయినా బ్రహ్మర్షి కావాలనే పట్టుదలతో తపస్సు కొనసాగించాడు. తపస్సు చేస్తున్న రోజుల్లోనే ఇంద్రుడు ఆహారం కోసం పేద బ్రాహ్మణుడు వేషధారణలో వచ్చి భిక్ష అడుగగా, విశ్వామిత్రుడు తాను స్వీకరించు టకు సిద్ధపరచుకొన్న ఆహారాన్ని ఇచ్చి సంతృప్తిపరిచాడు. అయినా బ్రహ్మ కోసం తప స్సు కొనసాగించాడు. గరిష్ఠ స్థాయిలో ఉన్న మహర్షికి బ్రహ్మ ప్రత్యక్షమై ”బ్రహ్మ ఋ షి” అని పిలిచాడు.
ఆవిధంగా విశ్వామిత్రుడు తన తపస్సు ఫలం వల్ల, జ్ఞానంవల్ల బ్రాహ్మణత్త్వం పొందగలిగాడు.” అని భీష్ముడు ధర్మరాజుకు వివరించారు. సంధ్యావందనం చేసే సమయంలో గాయత్రీ మంత్ర పఠనంలో ”విశ్వామిత్ర ఋషి: గాయత్రీ ఛంద:” అని వస్తుంది. అందుకే బ్రహ్మ వరంవల్ల విశ్వానికే మిత్రుడు అయ్యాడు.
అసలు ఆయన నామం కౌశికరాజు. బ్రాహ్మణత్త్వం సిద్ధించాలంటే, వేదపండి తుడై, సదాచారాలు పాటిస్తూ, ధర్మబద్ధంగా జీవించాలి. అందుకే మనం వేద పండితులను గౌరవించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement