Thursday, May 2, 2024

హనుమ కార్యదీక్షాపరత్వం

శ్రీరామచంద్రుడి ఆదేశానుసారం ఆంజనే యస్వామి సీతమ్మను వెతకడానికి సముద్రయా నం ప్రారంభించాడు. సముద్రంపై వాయువేగం తో వెళుతున్న హనుమను కిందనుండి సాగరుడు చూసి ఇలా అనుకున్నాడు.”సాగరములు ఏర్పడ డానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం. కనుక ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాము డి కార్యానికి హనుమంతుడు సాగరం మీదుగా ప్రయాణిస్తున్నాడు. అలసిన ఆయనకు మధ్యలో ఆతిథ్యం ఇవ్వడం మ న ధర్మం” అనుకొని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి ”నిన్ను దేవేం ద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళలోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పు డు సముద్ర మార్గం నుండి భూమి మీదకి వచ్చే వారు. వారు అలా రాకుండా ఉండడానికి పాతా ళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డా వు. ఇక కింద వారు పైకిరారని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కాని నీకున్న శక్తి వలన నువ్వు పైకి, కిందకి, పక్కలకి పెరగగలవు. అందుకని హను మంతుడికి ఆతిథ్యం ఇవ్వడానికి ఒకసారి పైకి లే. ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు” అన్నాడు.
సముద్రుడి ఆదేశానుసారం ఆ మైనాక పర్వ త శిఖరాలు సముద్రం నుండి పైకి వచ్చాయి. బయటకి వచ్చిన ఆ బంగారు శిఖరాలపై సూర్య కాంతి పడగానే ఆకాశం అంతా ఎర్రటి రంగుచేత కప్పబడింది. ఆ శిఖరాలని చూసిన హనుమం తుడు ”ఇంతవరకు ఈ శిఖరాలు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరాలు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించ డానికి అడ్డు వస్తున్నారు” అని భావించి ఆ శిఖరా లని ఒక్కసారికొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణ మైపోయాయి. అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరముల మీదనే నిలబడి ”అయ్యా! నువ్వు మాకు ప్రత్యేక మైన ఉపకారం చేసిన విశిష్ట అతిథివి. ఉపకారం చేసినవాడికి ప్రత్యుపకారం చేయడం మా ధర్మం. ఇక్ష్వాకు వం శీయుల వలన సముద్రం ఉపకారం పొందింది. నీ తండ్రి వాయు దేవుడి వలన మేము ఉపకారం పొందాము. (కృత యుగంలో పర్వతాలకి రెక్క లు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయే వి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, ప్రజలు భయ పడ్డారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలని నరికేశాడు. మైనాకుడి రెక్కలని కూడా నరకబోతుంటే, మైనాకుడి మిత్రు డైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారేశాడు. ‘పోనీలే సముద్రంలో పడితే పడ్డాడు. రాక్షసులు బయటకు వచ్చే ద్వారా నికి అడ్డంగా పడ్డాడు’ అని ఇంద్రుడు వదిలేశాడు. అందుకని నువ్వు ఒకసారి నా పర్వత శిఖరముల మీద సేదతీరి తేనెతాగి, ఫలాలు భుజించి విశ్రాం తి తీసుకుని వెళ్ళు” అన్నాడు. అప్పుడు ఆంజనే యస్వామి ”మీ ఆతిథ్యానికి నమస్సులు. కానీ నేను చెయ్యవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం లోపు నేను వెళ్ళాలి. సీతమ్మ జాడను కనుగొనేవరకు విశ్రమించనని నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు.” అని చెప్పి ముందుకు సాగాడు హనుమంతుడు.

  • అంజనాదేవి
Advertisement

తాజా వార్తలు

Advertisement