Friday, May 3, 2024

ఒక చెట్టుకి 839ట‌మాటాలు-గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చోటు..

ట‌మాటా చెట్టుకి మ‌హ అయితే ఎన్ని కాయ‌లు కాస్తాయి..10అనుకుందాం..కానీ ఇక్క‌డ ఏకంగా 839కాయ‌లు కాయ‌డం విశేషం..వివ‌రాలేంటో చూద్దాం.. భార‌తీయుల వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించేంది ట‌మాటా..ప‌లు కూర‌గాయల‌తో క‌లగ‌లుపుగా ట‌మాటాని విరివిగా ఉప‌యోగిస్తుంటారు. దాంతో ట‌మాటా వాడ‌కం ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో ట‌మాటా రేట్లు కూడా ఆకాశానంటుతున్నాయి. ఎర్ర‌గా..చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపించే ఈ టమాటోలను మొదట్లో ఇంగ్లాండ్ లో అందం కోసం పెంచుకునేవారట.. కాలక్రమంలో టమాటా కూరగాయగా మార్పు చెందింది. ఇంగ్లాండ్ నుంచి భారతదేశంలో సుమారుగా 1850 లలో ప్రవేశించింది.

ట‌మాటాల‌ని తెలుగులో సీమ వంగ, రామ ములగ అని అంటారు. ఇప్పుడు మనదేశంలో టమాటో కూరలేని ఇల్లు, టమాటో కూరలేని దుకాణం ఉండదు. ఒక టమాటా చెట్టు.. గుబురుగా పెరిగి.. గుత్తులు గుత్తులుగా ఐదు నుంచి 6 కాయలు.. ఇలా మొత్తం చెట్టు మహా అయితే ఒకేసారి 25 వరకూ కాస్తాయి. అయితే ఓ వ్యక్తి.. కొత్త పద్దతిలో వ్యవసాయం చేయ‌డంతో.. ఒక చెట్టుకు ఏకంగా 839 కాయలు కాశాయి. దాంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఈ మొక్క స్థానం చోటు చేసుకుంది. దీనికి కారణం గ్రీన్చే హౌస్ పద్ధతిలో సాగు చేయడం కారణం అని స్మిత్ చెప్పాడు.

ఈ చెట్టుకు పసుపు టమాటాలు కాసాయి. వీటిని చెర్రీ టమోటాలుగా పిలుస్తారు. వీటిని స్నాక్స్ తయారు చేయడానికి వినియోగిస్తారట. బ్రిటన్ కు చెందిన డగ్లస్ స్మిత్ అనే 43 ఏళ్ల వ్యక్తి సాధారణ ఊహకు అందని అపురూపమైన ఘనత సాధించాడు. స్మిత్ ఐటీ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు తనకు ఇష్టమైన వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. సాగ లో కొత్త పద్దతులను తీసుకుని వచ్చి.. తాను పండించే పంట దిగుబడిలో ఓ రేంజ్ లో సాధిస్తున్నాడు. గ్రీన్ హౌస్ పద్దతిలో చెర్రీ టమోటా పంటను సాగు చేస్తున్నాడు. మార్చి నెలలో టమోటాల విత్తనాలను నాటాడు. మొక్కను పెంచడానికి స్మిత్ రోజులో 3 నుంచి 4 గంటల సమయం వెచ్చించాడు. ఇప్పుడు ఆ టమాటా మొక్కకు ఏకంగా 839 టమాటాలు కాసాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement