Wednesday, April 17, 2024

నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం మన ఆర్టీసీ!

మెట్రో రైలులో ఓ గర్భిణీ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే, దీనిపై టీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి నైతిక విలువలను పెంచుకుందామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు. అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నైతిక విలువలు పెంచే ఏకైక ప్రదేశం టీఎస్ఆర్టీసీ అని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం.. నైతిక విలువలను పెంచుకుందామని కోరారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా సజ్జనార్ పోస్ట్ చేశారు.

సదరు వీడియోను వినూత్నంగా విద్యార్థులతో రూపొందించారు. బస్సు ప్రయాణిస్తుండగా.. తొలుత ఓ వృద్ధురాలు రాగా వేరేవారు నిలబడి ఆమెకు సీటు ఇస్తారు. తర్వాత వికలాంగురాలు, చిన్నారితో బస్సు ఎక్కిన మహిళ, గర్భిణీ మహిళలకు వేరేవారు తమ సీట్లను త్యాగం చేసి వారికి ఇస్తారు. ఇలా అవసరమైన వారికి సీటు ఇచ్చి గౌరవించడం కేవలం ఆర్టీసీలోనే జరుగుతుందని సజ్జనార్ చెప్పారు.

ఇది కూడా చదవండి: TSRTC: బస్ టికెట్ల కోసం కొత్త సేవలు

Advertisement

తాజా వార్తలు

Advertisement