Thursday, May 2, 2024

‘పెద్దన్న’ చిత్రం..హిట్టా..ఫట్టా..

దీపావళి పర్వదినాన ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది అన్నాత్తే. మరి ఈ చిత్రం హిట్టా..ఫట్టా తెలుసుకుందాం. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రని పోషించారు. ఆయనికి జోడీగా స్టార్ హీరోయిన్ నయనతార నటించింది. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కి చెల్లెలుగా హీరోయిన్ కీర్తి సురేష్ నటించారు. కాగా రజనీకాంత్ .. స్టైల్‏కు యంగ్‏స్టర్స్ కూడా పోటీ పడలేరు. ఇప్పటికీ రజనీ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.. యంగ్ హీరోలకు పోటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారాయన. అన్నాత్తే చిత్రాన్ని తెలుగులో పెద్దన్నగా దీపావళీ సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో ఖుష్భూ, మీనా కీలక పాత్రలలో నటించారు.

అన్నాత్తై అదేనండి పెద్దన్న మూవీలో రజనీకాంత్ వన్ మ్యాన్ షో కనబర్చారనే టాక్ వినిపిస్తోంది. అన్నాచెల్లెలు అనుబంధం అనే సెంటిమెంట్‏తో సాగిన ఈ మూవీ ఫస్ట్ హాఫ్ కాస్త బోరింగ్ అనిపించినా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్, మాస్ ఇంటర్వెల్ ఫైట్ సినిమాకు హైలేట్ అని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కాస్త పర్వలేదని అనిపించినా.. క్లైమాక్స్ కూడా సినిమాకు క్లిక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు.. పెద్దన్న సినిమా సూపర్ అని.. అస్సలు బోరింగ్ లేదని.. రజనీకాంత్ మరోసారి హిట్ అందుకోవడం పక్కా అంటున్నారు నెటిజన్స్. ఇక ఇందులో జగపతి బాబు విలన్ పాత్రలో మరోసారి అదరగొట్టారనే చెప్పాలి. ఇక పెద్దన్న సినిమాను రజనీ మేనియానే హిట్ చేస్తుందంటున్నారు నెటిజన్స్,ఆయన ఫ్యాన్స్. ఓవరాల్ గా సినిమా బాగుందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement