Tuesday, May 7, 2024

జీహెచ్ ఎంసీ ఆఫీసులో లక్ష్మి పూజ.. అంద‌రూ సంతోషంగా ఉండాల‌న్న మేయర్, డిప్యూటీ మేయర్

హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో లక్ష్మి పూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో హైద‌రాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. దీపావళి పండుగ హిందువులకు ప్రత్యేక మైనద‌న‌నారు, చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారన్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటార‌ని మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి అన్నారు. అశ్యయుజా బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియ భగినీ హస్త భోజనంతో ముగుస్తాయన్నారు. ఆరోగ్యానికి ఔషధానికి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజు ఆరోగ్యం కోసం అనారోగ్యం నుండి ఉపశమనం కలగడానికి ధన్వంతరి పూజ చేస్తారన్నారు. ఈ రోజు ధనలక్ష్మి పూజ చేస్తే ధన ధాన్యాలు అష్టఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి అని ప్రజల నమ్మకం మన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. అంతకుముందు చార్మినార్​ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి.

కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడి, సరోజ చీఫ్ ఫైనాన్స్ అడ్వజైర్, విజయ కుమార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, పద్మజ, చీఫ్ పిఆర్ఓ ఆఫీస్ పిఅర్ఓ జీవన్ కుమార్, ఫైనాన్స్ విభాగపు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement