Sunday, May 5, 2024

ఈశ్వ‌ర్ నాథ్ గా జ‌గ‌ప‌తిబాబు..గ‌ని లుక్ రిలీజ్..

కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో గ‌ని చిత్రం తెర‌కెక్కుతోంది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో డాగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, ఈ నెల 15వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో గ‌నిగా వ‌రుణ్ తేజ్ మెర‌వ‌నున్నాడు.ఈ సినిమాలోని ముఖ్యమైన తారాగణానికి సంబంధించిన వివరాలను అందించడమే కాకుండా, వారు పోషించిన పాత్రల తాలూకు లుక్ ను రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో నదియా పోషించిన ‘మాధురి’ పాత్రను పరిచయం చేస్తూ నిన్న ఆమె లుక్ ను వదిలారు. ఇక జగపతిబాబు పోషించిన ఈశ్వర్ నాథ్ పాత్రను పరిచయం చేస్తూ, నేడు ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement