Saturday, April 27, 2024

ధాన్యం కొనుగోలు కరపత్రం ఆవిష్కరణ..

మనోహరాబాద్ : ప్రభుత్వం రైతులకు పెద్దపీఠ వేస్తుందని ఎంపిపి పురం నవనీత రవి ముదిరాజ్‌ అన్నారు. మండలంలోని కాళ్లకల్‌ గ్రామంలో ఎంపిటిసి నత్తి లావణ్య, పంచాయతీ పాలకవర్గంతో కలిసి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్న కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పండించిన వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.1888 కనీస మద్దతు ధర కల్పించడం హర్షనీయమన్నారు. రైతుల పంటలకు పెట్టుబడి సహాయం, పండించడానికి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించడమే కాకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ప్రతి రైతు గుండెలో కేసీఆర్‌ స్థిరస్థాయిగా నిలిచాడన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు తుమ్మల రాజుయాదవ్‌, బంటు శ్రీశైలం, బ్యాగరి రమేష్‌, ఏశం నాగరాజు, ఏపిఎం శ్రీనివాస్‌, నాయకులు రాగం దుర్గేష్‌యాదవ్‌, దండు సత్యనారాయణ, గానుగు వెంకటేష్‌ ముదిరాజ్‌, ఐకెపి సిబ్బంది కృష్ణవేణి, కల్పన, సునంద, వాణి, పురం నవీన, బీబీ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement