Sunday, May 5, 2024

భారత్ బయోటెక్, హెటెరో ఎండీలకు సీఎం జగన్ ఫోన్

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజువారి కేసుల సంఖ్య పది వేలు దాటింది. రాష్ట్రంలో మహమ్మారి  వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ కు చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ కోరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఫార్మా అధినేత పార్థసారథి రెడ్డిలతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. ఏపీకి కొవాగ్జిన్ టీకా డోసులను పెద్ద సంఖ్యలో అందించాలని కృష్ణ ఎల్లాను కోరారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ వయల్స్ ను ఏపీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లతో పాటు, రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని ఇరువురిని సీఎం కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement